కుభీర్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక (Clay Vinayakas ) విగ్రహాలు శ్రేయస్కరమని ప్రధానోపాధ్యాయుడు దొంతుల సురేష్ ( HM Suresh) పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు గాను ఉపాధ్యాయుడు లింగన్న ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులచే మట్టి విగ్రహాలను తయారు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక విగ్రహాల ప్రతిష్టాపనలో మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్టించాలని కోరారు. దీని వల్ల పర్యావరణాన్ని పరిరక్షించినవారమవుతామని పేర్కొన్నారు. విద్యార్థులు తమ తమ ఇండ్లలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు మట్టి వినాయకుడి ప్రతిమలు తయారు చేశారు. తయారుచేసిన విగ్రహాలను విద్యార్థుల ద్వారా గ్రామంలో పంపిణీకి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజశేఖర్ భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, మధుసూదన్, ఎల్లన్న, సంజీవ్ సి.ఆర్పి.బాలేరావ్ గంగాధర్ , విద్యార్థులు పాల్గొన్నారు.