ఉట్నూర్, డిసెంబర్ 6 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్, పీఏసీఎస్ చైర్మన్ సామ ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బాలాజీ, మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, మాజీ అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో…
ఇచ్చోడ, డిసెంబర్ 6: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నారాయణ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసిఫ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి భీంరెడ్డి, జిల్లా కార్యదర్శి భీమన్న, నాయకులు ముస్తాఫా, రషీద్, మల్లన్న, మధుకర్, రాజేశ్వర్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌చౌక్ వద్ద గల విగ్రహానికి మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అల్లూరి భూమన్న పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ సంఘ భవనంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు చిక్కాల దత్తు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాల సంఘం నాయకులు దాసరి బాబన్న, శంకర్, శ్రీనివాస్, వరప్రసాద్, రాజేశ్వర్, కమలమ్మ, బీసీ సంఘం నాయకులు జగదీశ్, నర్సాగౌడ్, అంజన్న, అశోక్, శ్రీనివాస్, వెంకటేశ్, రవి, పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ వనిత ఠాక్రే, సర్పంచ్ ఇంద్రశేఖర్ పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు కాంగార్పూర్, డోప్టాల, సాంగిడి, సిర్సన్న గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్, ఎంపీవో సమీర్ హైమద్, సర్పంచ్‌లు వాడ్కర్ తేజ్‌రావు, రాకేశ్, ప్రిన్సిపాల్ వరప్రసాద్‌రావు, సూర్యప్రకాశ్, పంచాయతీ కార్యదర్శులు, ఆశకార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
బోథ్ మండలంలో..
మండలంలోని సొనాల, బోథ్, కౌఠ(బీ) గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో సొనాల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు భీంరావ్ పాటిల్, ప్రధాన కార్యదర్శి బీ స్వామి, ఎం సోమన్న, అమృత్‌రావు పాటిల్, చిన్నయ్య, శంకర్, జగ్విన్, కౌఠ(బీ) సర్పంచ్ రాధిక, పంచాయతీ కార్యదర్శి సంజీవ్‌రావు, గంగాధర్, ఎంపీడీవో రాధ, నాయకులు గజేందర్, కే మహేందర్, పసుల చంటి, ప్రవీణ్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్‌లో..
మండల కేంద్రంతో పాటు సీతాగోంది, మన్నూర్, ముత్నూర్, కమలాపూర్ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద జడ్పీటీసీ బ్రహ్మానంద్, వివిధ సంఘాల నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమాల్లో అంబేద్కర్ మెమోరియల్ అధ్యక్షుడు మాధవ్, డీఎస్పీ మండలాధ్యక్షుడు బడుగు రాజేశ్వర్, దళిత శక్తి ప్రోగాం సంఘ సభ్యులు, నాయకులు ససానే సిద్ధార్థ్, మాధవ్, బుద్దె కిషన్, కరుణాకర్, బండారి రవీందర్, బొర్ర రవి, రాజు, గోపీకృష్ణ, రాకేశ్, లహూదాస్, కుశల్, శంకర్, మిలింద్ పాల్గొన్నారు.
తలమడుగులో…
మండల కేంద్రంతో పాటు సుంకిడి, కుచులాపూర్, సాయిలింగి, ఖోడద్, దేవాపూర్, బరంపూర్, ఉమ్రి, రుయ్యాడి, అర్లి గ్రామాల్లో ఎంపీపీ కల్యాణం లక్ష్మి, జడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి, ఎంపీటీసీలు, అధికారులు అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
నేరడిగొండలో..
నేరడిగొండ, డిసెంబర్ 6 : గుత్పాల, నేరడిగొండ, సావర్గాం, తేజాపూర్, వడూర్, కుమారి, కుప్టి, వాంకిడి గ్రామాల్లో యువజన సంఘాల నాయకులు, గుత్పాల వీడీసీ చైర్మన్ సురేశ్ అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు అభిలాష్, దావుల దినేశ్, రాములు, చుంచు లింగయ్య, కిష్టయ్య, ఉడుగుల గంగయ్య, దావుల రవి, రాజన్న, జాదవ్ మహేందర్ పాల్గొన్నారు.
బజార్హత్నూర్లో..
మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో మాల సంఘం నాయకులు, గ్రామస్తులు, ఎస్ఐ అరుణ్‌కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దళిత శక్తి మండల కోఆర్డినేటర్ నరేశ్ మహారాజ్, నాయకులు సాయన్న, సుభాష్, గణేశ్, ప్రకాశ్, నవీన్, గౌతం, శంకర్, రాజేందర్ పాల్గొన్నారు.
సిరికొండలో..
మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాల, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాంప్రసాద్ ఉపాధ్యాయులు స్వాతి, సునీత, ప్రశాంత్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షేక్ ఇమామ్, మైనార్టీ చైర్మన్ రంజాన్ పాల్గొన్నారు.
ఉట్నూర్ మండలంలో..
ఘన్పూర్ గ్రామంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్, సర్పంచ్ పంద్ర లత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హస్నాపూర్, దంతన్‌పల్లి, శ్యాంపూర్, సాలేవాడ, నర్సాపూర్(బీ) గ్రామాల్లో సర్పంచ్‌లు, నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇంద్రవెల్లిలో..
మండల కేంద్రంతో పాటు సట్వాజిగూడ, శంకర్‌గూడ, బుర్సన్‌పటార్, మర్కాగూడ గ్రామాల్లో దళిత సంఘాలు, పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం త్రిషరన్, పంచశీల్తో పాటు వందన తీసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రం ఈశ్వరీబాయి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఈవో శ్రీనివాస్‌రెడ్డి, గ్రంథాలయ అధికారి కాంబ్లే వెంకటి సుంకట్రావ్, తుడుం దెబ్బ జిల్లా గౌరవాధ్యక్షుడు ఆర్కా ఖమ్ము, మాజీ ఎంపీపీ కనక తుకారాం, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మరప రాజు, ఉపాధ్యాయుడు అనిల్, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకట్రావ్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు యాకుబ్‌బేగ్, నాయకులు, దళితులు పాల్గొన్నారు.
తాంసి మండలంలో…
మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరుణ్‌కుమార్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కంది గోవర్ధన్‌రెడ్డి, సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ సామ సంతోష్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, నాయకులు శ్రీనివాస్, గంగరాం, కళ్యాణ్, తుడుందెబ్బ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పొన్నారిలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ సంజీవ్‌రెడ్డి, ఎంపీటీసీ రఘు, ఉపసర్పంచ్ అశోక్, పీఏసీఎస్ డైరెక్టర్ చంద్రన్న, నాయకులు రమేశ్, ఆనంద్, సంజీవ్ పాల్గొన్నారు.
ఏఆర్ఎస్లో…
ఆదిలాబాద్‌లోని వ్యవసాయ పరిశోధనా స్థానం(ఏఆర్ఎస్)లో ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ డీ మోహన్‌దాస్, రాజశేఖర్, అనిల్‌కుమార్, సిబ్బంది మహేశ్, ఏఈవో శ్రీకాంత్, ఎస్ఆర్ఎఫ్ ఎం నరేశ్, దేవానంద్, వై రవి, పోతన్న పాల్గొన్నారు.
మేడిగూడ(ఆర్)లో..
మేడిగూడ (ఆర్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సత్యవాన్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణ, ఎస్ఎంసీ చైర్మన్ అడెళ్లు, స్వేరోస్ రాష్ట్ర కార్యదర్శి పెంటపర్తి ఊశన్న, ఉపాధ్యాయులు భగత్ దిలీప్, దేవీదాస్, ప్రకాశ్, భూమయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
నార్నూర్, డిసెంబర్ 6 : నార్నూర్, గాదిగూడ మండలాల్లోని దళితవాడలో పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గాదిగూడ వైస్‌ఎంపీపీ యోగేశ్, మాల మహానాడు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు నవీన్, విద్యావేత బాలాజీ కాంబ్లే, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.