హాజీపూర్ : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ఫారెస్ట్ (Lakshettipeta Forest ) రేంజ్ పెద్దంపేట సెక్షన్ పరిధిలో ఉన్న పోచంపల్లి అడవి ప్రాంతం శనివారం తెల్లవారుజామున మేత కోసం వెళ్లిన ఆవుల మందపై చిరుతపులి (Leopard attacks) హఠాత్తుగా దాడి చేసింది. ఈ ఘటనలో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. మొర్రిగూడెం గ్రామానికి చెందిన ఆవు యజమాని కూడమేత సతీశ్ విషయం తెలుసుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.
ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు కెమెరా ట్రాప్స్ ను పరిశీలించి, చిరుత అడుగులు గుర్తించామని అటవీ క్షేత్రాధికారి అనిత తెలిపారు. అటవీ ప్రాంతంలో పులి, చిరుతపులి సంచరిస్తున్నందున సమీప గ్రామాల ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని , కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్వో అల్తాఫ్ హుస్సేన్, ఫారెస్ట్ బీట్ అధికారి రాజశేఖర్, కలిమ్,రాజు పాల్గొన్నారు .