కాసిపేట : ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడితే చట్టప్రకారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ (ACP Ravi Kumar ) హెచ్చరించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం(బీ), సోమగూడెం(కే), కాసిపేట తదితర గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.
ఏసీపీ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు శాంతి యుతంగా నిర్వహించుకోవాలని, ఎటువంటి గొడవలు సృష్టించవద్దన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు తీయలన్నా అనుమతులు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, కాసిపేట ఎస్సై ఆంజనేయులు, దేవాపూర్ ఎస్సై గంగారాం, మందమర్రి ఎస్సై రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.