ఇచ్చోడ, అక్టోబర్ 24 : సీఎం కేసీఆర్‌తోనే రైతురాజ్యం సాధ్యమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మంగళవారం మండలంలోని సిరిచెల్మ గ్రామంలో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ గెలుపు కోసం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతమ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ముండే పాండురంగ్, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, మాజీ చైర్మన్ వై రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నార్వాడే రమేశ్, షాబీర్, సిరిచెల్మ సర్పంచ్ కనమయ్య, ఉపసర్పంచ్ అజీమ్, శిరీష్ రెడ్డి, గంగాధర్, సుభాష్ పాటిల్, గిత్తే నందకిశోర్, నరాల శ్రీనివాస్, దయాకర్ రెడ్డి, తులసీరాం, మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్, కో ఆప్షన్ సభ్యులు ఎస్కే మహమూద్, శ్రీకాంత్ రెడ్డి, ఫరీద్, గణేశ్, కరీం, అల్తాఫ్ పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండలో సర్పంచ్ నర్మదాపెంటన్న బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ గెలుపు కోసం ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ మ్యానిఫెస్టో, సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమలో ఎంపీటీసీ పర్వీన్ లతీఫ్, ఉప సర్పంచ్ చందు, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఎక్బాల్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బోథ్, అక్టోబర్ 24 : మండలంలోని పట్నాపూర్, నక్కలవాడ, లక్ష్మీపూర్, రేండ్లపల్లి గ్రామాల్లో ఎంపీపీ తుల శ్రీనివాస్ నాయకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారాన్ని హోరెత్తించారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధించాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ పంద్రం సుగుణ శంకర్, పీఏసీఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, అల్లకొండ ప్రశాంత్, రాజేశ్వర్, మహిపాల్, జుగాది, విజయ్ పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కేసీఆర్‌కే సాధ్యం
బోథ్, అక్టోబర్ 24: అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కేసీఆర్‌కే సాధ్యమని జడ్పీటీసీ డాక్టర్ సంధ్యారాణి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో గడపకు గడపకు బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు. సబ్బండ వర్గాలకు కొండంత అండా కలిగించేలా మ్యానిఫెస్టో ఉందని ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి జాదవ్ అనిల్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రుక్మాణ్‌సింగ్, ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్, గ్రంథాలయ డైరెక్టర్ రమణగౌడ్, బీసీ సెల్ మండలాధ్యక్షుడు బుచ్చన్న, ఎస్వీ రమణ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు రఫీ, రవీందర్ యాదవ్, సత్యనారాయణ, నాయకులు దేవీదాస్, రఫీ, ప్రవీణ్, గంగాధర్ పాల్గొన్నారు.
కారు గుర్తుకు ఓటేయాలి
భీంపూర్, అక్టోబర్ 24 : మండలంలోని గుబిడి, కొజ్జన్గూడ, టేకిడిరాంపూర్లో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్‌ఎంపీపీ గడ్డం లస్మన్న, నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా జాదవ్ అనిల్‌ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, సర్పంచ్‌లు ఎల్పుల ప్రతాప్యాదవ్, మడావి లింబాజీ , బాదర్, సువర్ణ , రైతు బంధు సమితి మండల కన్వీనర్ అనిల్, ఉపసర్పంచ్ ఆకం శ్రీనివాస్‌యాదవ్, నాయకులు షేక్ అఫ్రోజ్, తూడి హన్మాండ్లు, నరేందర్‌యాదవ్, విఠల్, గడ్డం రవీందర్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి ,ఎం.కల్చాప్యాదవ్, ముకుంద సంతోష్ , సంజీవ్‌రెడ్డి, మహేదర్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.