ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 10 : సీసీఐ పునః ప్రారంభించాలని చేపట్టిన జాతీయ రహదారిని దిగ్బంధం కార్యక్రమానికి మావల మండల టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. గురువారం మావల నుంచి జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ తీస్తూ జందాపూర్ వరకు తరలివెళ్లారు. అక్కడ సిమెంట్ పరిశ్రమ తెరిపించాలని నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్నను కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మావల జడ్పీటీసీ వనిత, సర్పంచ్ ప్రమీల, నాయకులు రాజేశ్వర్, చందాల రాజన్న, మహేందర్ యాదవ్, ఉమాకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బేల మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు కలిసి గురువారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన సీసీఐ ధర్నాకు తరలివెళ్లారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, నాయకులు గంభీర్‌ఠాక్రే, ప్రమోద్‌రెడ్డి, మంగేశ్, చంద్రశేఖర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.