ఆదిలాబాద్ : జిల్లాలోని మావల బైపాస్ సమీపంలో గల శ్రీనివాస దాబా సమీపంలో కొబ్బరి బోండాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో రోడ్డు మధ్యలోని డివైడర్ను ఎక్కించాడు. దీంతో లారీ డీజిల్ ట్యాంకు మంటలు అంటుకున్నాయి. వెంటనే లారీ దూకి పరారవ్వగా క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.