ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, అక్టోబర్ 7 : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిషరించే దిశగా కృషి చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆసిఫాబాద్ పట్టణం బజార్‌వాడి, సందీప్ నగర్, బ్రాహ్మణవాడకు చెందిన పలువురు.. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతి మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నా రు.
దహెగాం మండలం మొట్లగూడ గ్రామానికి చెందిన ఎనగందుల సంచి.. కంప్యూటర్ పీజీడీసీఏ చేశానని, ఉపాధి కల్పించాలని.., చంద్రపెల్లి గ్రామానికి చెందిన దుర్గం మారు తి.. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేశానని వైద్య కళాశాలలో ఉపాధి కల్పించాలని.., ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామానికి చెందిన బొమ్మన రాజయ్య.. వృద్ధాప్య పింఛ న్ ఇప్పించాలని.., ఇప్పల్నవేగం గ్రామానికి చెందిన గుమ్మల విద్యాసాగర్.. దివ్యాంగ పింఛన్ ఇప్పించాలని.., వాంకిడి మండలం లంజన్ వీర గ్రామానికి చెందిన నగోష మోతీరాం.. కుటుంబంలో భూ వివాదం తలెత్తిందని న్యాయం చేయాలని..,
పునుగూడకు చెందిన ఉయక గిర్జుబాయి.. భర్తకు ఖమాన గ్రామ శివారులో పట్టా భూమి ఉందని, ఆయన చనిపోగా, విరాసత్ చేసి పట్టా ఇప్పించాలని.., సరాండి గ్రామానికి చెందిన కుశ్నపల్లి నారాయణ.. పట్టా భూమి వివరాలు నమోదు చేసి కొత్త పట్టా పాసుపుస్తకం మంజూరు చేయాలని.., కెరమెరి మండలం కరంజివాడ గ్రామానికి చెందిన రాథోడ్ శ్రీనివాస్.. ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూమికి సంబంధించి రైతు భరోసా డబ్బు ఇప్పించాలని అర్జీలు పెట్టుకున్నారు. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై తక్షణమే పరిష్కరించాలి : ఎస్పీ శ్రీనివాస్‌రావు
ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 7 : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే పరిష్కరించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించా రు. తక్షణమే ఆయా పోలీస్ స్టేషన్లకు ఫోన్ చే సి మాట్లాడి పలు సూచనలు చేశారు. పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, అక్టోబర్ 7 : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుం చి దరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల, నస్పూర్, బెల్లంపల్లి, మందమర్రి, క్యాతనపల్లి, దండేపల్లి నుంచి వచ్చిన ప్రజలు దరఖాస్తులు అందజేశారు. మొత్తంగా 30 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో బెల్లంపల్లి, మంచిర్యాల ఆర్డీవోలు హరికృష్ణ, రాములు, అధికారులు పాల్గొన్నారు.
ఆర్ట్, మ్యూజిక్ పోస్టులను భర్తీ చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీలో 1733 ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ జిల్లా ఆర్ట్ క్రాప్ట్ మ్యూజిక్ నిరుద్యోగుల అసోసియేషన్ నాయకులు వినతి పత్రం అందించారు. ఖాళీగా ఉన్న ఆర్ట్క్రాప్ట్, మ్యూజిక్ పోస్టులను భర్తీ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకుండా పోయిందని, అభ్యర్ధులు దాదాపు లక్ష మందికి పైగా రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. సునీల్, దివ్య, రాజగోపాల్, జనార్దన్, భీమేశ్ పాల్గొన్నారు.
ఆక్రమణలను అడ్డుకోవాలి..
బెల్లంపల్లి, అక్టోబర్ 7 : బెల్లంపల్లిలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అడ్డుకోవాలని ఎంసీపీఐ(యూ) నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, పసులేటి వెంకటేశ్, ఆరెపల్లి రమేశ్.. ప్రజావాణిలో కలెక్టర్ కుమార్‌దీపక్‌కు దరఖాస్తు సమర్పించారు. నియోజకవర్గంలోని అసైన్డ్, ప్రభుత్వ భూములను కొందరు నాయకులు అధికారులతో కుమ్మక్కై ప్లాట్లుగా చేసి, విక్రయిస్తున్నారని ఆరోపించా రు. చొప్పరిపల్లి సెక్టార్‌కు చెందిన బూడిదగడ్డ బస్తీలోని అంగన్వాడీ కేంద్రం సరిగా తెరవ డం లేదని, విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్న టీచర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
కాసిపేటలో ఒకే శాఖకు పరిమితం..
కాసిపేట, అక్టోబర్ 7 : పైన ఫొటోలో చూసి ప్రజావాణిలో ఇంత మంది అధికారులు ఉన్నారేంటి అనుకునేరు..! వీరంతా ఒకే శాఖకు సంబంధించిన అధికారులే. అధికారులెవరూ రాకపోవడంతో ఆ కార్యాలయ అధికారులే ప్రజావాణిలో కూర్చొని, వారి పనులు చూసుకుంటూ ఇలా దర్శనమిచ్చారు. కాసిపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ఒక్క శాఖకే పరిమితం కావడం.. ఆయా శాఖల అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రతీ సోమవారం నిర్వహించే కార్యక్రమానికి మండల పరిషత్ అధికారులు తప్ప ఎవరూ ఉండడం లేదని పలువురు అంటున్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి ఉంటున్నది కాబట్టి అదే శాఖ అధికారులు (మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు) తమ పనులు చేసుకుంటూ కనిపిస్తున్నారు. దీంతో ఇక ఫిర్యాదు చేసే వారు ఇక్కడికి రాకుండా నేరుగా జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణికే వెళ్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రజావాణిలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.