రెబ్బెన, ఫిబ్రవరి 8 : పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ధోత్రే అన్నారు. శనివారం రెబ్బెన మండలం గంగాపూర్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం బోధించి పలు ప్రశ్నలు అడిగారు. సమాధానాలు రాబట్టారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాను ముందంజలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన తహసీల్దార్ రామ్మోహన్రావు, హెచ్ఎం అబ్దుల్ లతీఫ్, గణితం ఉపాధ్యాయురాలు పావని ఉన్నారు.
ఈవీఎంల గోదాం పరిశీలన
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఫిబ్రవరి 8 : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోదాం వద్ద రక్షణ చర్యలను పరిశీలించారు. గోదాములో భద్రపరిచిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను భద్రపరిచిన తీరును సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎన్నికల పర్యవేక్షకుడు సునీల్, నాయబ్ తహసీల్దార్ శ్యామ్లాల్ పాల్గొన్నారు.