శ్రీరాంపూర్, జూలై 16 :సింగరేణి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)కు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, కార్మిక పారిశ్రామిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సింగరేణి 11 ఏరియాల టీబీజీకేస్ ముఖ్య నాయకులు అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యం లో కేటీఆర్‌తో సమావేశం ఆయ్యారు.
సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్ర భుత్వం ఎన్నికల సందర్భం గా ఇచ్చిన హామీల అమలు చేసేదాకా పోరాడాలన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల ను ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వా లు పన్నుతున్న కుట్రలను తిప్పకొట్టాలన్నారు.
టీబీజీకేఎస్ ఇన్చార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ నుంచి నుంచి టీబీజీకేఎస్ ఇన్చార్జిగా యూనియన్ వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే యూనియన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్‌ను తెలంగాణ భవన్లో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, చీఫ్ ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, నాయకులు, తదితరులు సన్మానించారు.