ఖానాపూర్, మే 21 : మలేషియా దేశంలో కొంతకాలంగా జైలులో మగ్గుతున్న కడెం, దస్తురాబాద్ మండలాలకు చెందిన ఆరుగురు కార్మికులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూ క్యా జాన్సన్ నాయక్ ప్రత్యేక చొరువతో బుధవారం స్వదేశానికి చేరుకున్నారు.
స్వదేశానికి తీసుకు రావడానికి కృషి చేసినందుకు బాధితులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్, జాన్సన్ నాయక్ లేకుంటే తమ జీవితాలు లేవని జీవితంతం రుణపడి ఉంటామని కంటతడి పెట్టి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నందినగర్‌లోని తన నివాసంలో కలిసినట్లు జాన్సన్ నాయక్ ‘నమస్తే తెలంగాణ’కు ఫోన్లో తెలిపారు. స్వదేశానికి చేరుకున్న వారిలో నరేశ్, భాస్కర్, శంకర్, రాజేశ్వర్, శ్రీనివాస్, రవీందర్ ఉన్నారు.