కేసీఆరే మళ్లీ రావాలి..
తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. నాకైతే పూర్తి విశ్వాసముందని, మళ్లీ తొందరలోనే మనకు మంచి రోజులు వస్తాయన్నారు. 2028లో ఆయనను తిరిగి సీఎం చేసుకోవాలని, మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
- 2028లో తిరిగి సీఎంను చేసుకోవాలి
- ఉమ్మడి ఆదిలాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం పక్కా
- క్యాతన్‌పల్లి స్ఫూర్తి రాష్ట్రమంతా రావాలి
- కౌన్సిలర్లందరికీ సెల్యూట్
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- మంచిర్యాలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం
మంచిర్యాల, ఏపిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. నాకైతే పూర్తి విశ్వాసముందని, మళ్లీ తొందరలోనే మనకు మంచి రోజులు వస్తాయన్నారు. 2028లో ఆయనను తిరిగి సీఎం చేసుకోవాలని, మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెం డా ఎరగడం కాయమని స్పష్టం చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా పార్టీ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేటీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే రూ.4 వేల పింఛన్ ఎప్పుడో వస్తుండే, కేటీఆర్ ప్రభుత్వమే వచ్చి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తుండే, కేసీఆర్ ప్రభుత్వం వచ్చుంటే సింగరేణి యు వతకు ఎప్పుడో ఉద్యోగాలు వస్తుండే.. కేసీఆర్ ప్రభుత్వమే ఉంటే రూ.15 వేల రైతుబంధు ఎ ప్పుడో వచ్చేదని కేటీఆర్ అన్నారు.
అందుకే మొన్న క్యాతన్‌పల్లిలో ఏ ప్రజాస్వామిక స్ఫూర్తినైతే ప్రజలు చూపించారో, అదే స్ఫూర్తి భవిష్యత్‌లో రాష్ట్రమంతా రావాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నిక వచ్చినా, సింగరేణి ఎన్నిక వచ్చినా తప్పకుండా బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మా మంచిర్యాల జిల్లా అవుతుందని, మంచిర్యాలలో 38 ఎకరాల్లో మెడికల్ కాలేజీ వస్తదని, 11 ఎకరాల్లో అద్భుతమైన హాస్పిటల్ వస్తదని ఎన్నడన్నా కలగన్నామా.. సింగరేణిలో అద్భుతంగా లాభాలు వస్తాయని, అందులో కార్మికులకు వాటాలు వస్తాయని అనుకున్నామా.. కానీ.. అవన్నీ చేసిన కేసీఆర్‌ను కాదని, కొందరు దొంగల మాటలు నమ్మి మోసపోయాలన్నారు. భవిష్యత్‌లో మళ్లీ అట్లా జరగకూడదని, మనకు బంగారం వంటి నాయకత్వం ఈ జిల్లాలో ఉందని, వాళ్లందరిని తప్పకుండా మళ్లీ భవిష్యత్‌లో గెలిపించుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

క్యాతన్‌పల్లి సైనికులకు అభినందనలు
క్యాతన్‌పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ చేసిన కుట్రలన్నీంటిని ఛేదించి, దాదాపు 51 రోజులు కుటుంబాలకు దూరంగా, ప్రలోభాలకు దూరంగా, కుట్రలను ఎదుర్కొంటూ, కుతంత్రాలను ఎదుర్కొంటూ పోరాడిన క్యాతన్‌పల్లి సైనికులందరినీ ఈ సందర్భంగా కేటీఆర్ అభినందనలు తెలిపారు. తమ్ముడు సుమన్‌ను, మా నాయకుడు మూల రాజిరెడ్డిని జైలుకి పంపించిన మొక్కవోని దీక్షతో పోరాడి, చివరికి ప్రజాస్వామ్యం గెలిచే విధంగా చేసిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు ప్రత్యేకించి పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో మనకిచ్చిన మాటకు కట్టుబడి మనతో నడిచిన కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) కౌన్సిలర్లకు, ఆ పార్టీ జిల్లా నాయకత్వానికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా క్యాతన్‌పల్లి చైర్మన్ సంధ్యారాణితోపాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లను కేటీఆర్ సన్మానించారు. రాజకీయాల్లో ఎన్నో చూస్తా ఉంటామని. కానీ.. ఇంత నీచమైన రాజకీయాన్ని మాత్రం ఎవరు కూడా చూసి ఉండరన్నారు. 22 కౌన్సిలర్ స్థానాలుంటే 14 స్థానాలు మనం గెలుచుకున్నామని, అవుట్రేట్ మెజారిటీ వచ్చిందన్నారు. ఇందులో చర్చించడానికి, తర్కించడానికి ఏం లేదన్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చి వాళ్లు చైర్మన్ అయ్యారని, అలాగే క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మనకు మెజారిటీ వస్తే మన పార్టీ నాయకులు చైర్మన్ కావాలన్నారు.
కానీ.. ఒక్క మున్సిపాలిటీ కోసం ఎన్ని అరాచకాలు చేశారో ప్రజలంతా చూశారన్నారు. లేని కేసులు బనాయించి, ఉల్టా కేసులు మన మీదే పెట్టి దౌర్జన్యం వాళ్లు చేసి రాళ్లు వాళ్లే వేసి మన కౌన్సిలర్లను ఎత్తుకపోయే ప్రయత్నం చేసి మన కౌన్సిలర్లను ప్రలోభపెట్టి, భయపెట్టి, ఇల్లు కూలకొడుతామని రకరకాల బెదిరింపులు చేసి చివరికి… బ్లాంక్ చెక్కులు రాసిచ్చినా.. ఎవడికి కావాలి నీ బోడి పైసలు అని చెప్పి వాళ్ల ముకాన కొట్టి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారన్నారు. ఈ విధంగా వ్యవహరించిన కౌన్సిలర్లందరికీ సెల్యూట్ చేస్తున్నాని కేటీఆర్ ప్రకటించారు.

అడిగితే ఇచ్చే వాళ్లం..
తమ్ముడు సుమన్‌ను పట్టుబట్టి.. ఇక్కడ సుమన్ ఉం టే వాళ్ల ఆటలు సాగవని చెప్పి తీసుకుపోయి ఇక్కడ సబ్జైల్లో పెట్టకుండా, ఆదిలాబాద్ జైలులో పెట్టారని కేటీఆర్ అన్నారు. ఆ జైలులోనూ సుమన్‌ను ఘోరాతిఘోరంగా హింసించారని మండిపడ్డారు. 16 రోజులపాటు చివరికి ఆ రోగ్యం దెబ్బతిని మందులు తెప్పించమంటే మందులు కూడా ఇవ్వకుండా, ఒక మున్సిపాలిటీ కోసం ఇంతకు దిగజారరన్నారు. అదే వివేక్ ఫోన్ చేసి మా సుమన్‌ను అడిగి ఉం టే.. తమ్మి నా ఇజ్జతి పోతుంది జెర ఇయ్యం టే.. మా సుమనే పారేసేటోడు.. అడిగితే ఇచ్చేటోడని.. అది పెద్ద ముచ్చట సైతం కాదన్నా రు. మేము గెలుపు, ఓటములు ఎన్నో చూ శాం. కానీ.. ఇట్లా నీచమైన పని చేయలేదన్నారు.
అందుకే మాతమ్ముడు సుమన్ మొండిగా.. జిద్దుగా… జైలకు పోయినోళ్లందరికీ ధైర్యం చెప్పిండన్నారు. న న్ను ఇక్కడ 16 రోజులు కాదు 20 రోజులు కాదు, ఉండమంటే సంవత్సరం ఉంటా. కానీ మీరు మా నాయకులకి ధైర్యం చెప్పండి.. మా కార్యకర్తలకి ధై ర్యం చెప్పండి.. మీరు క్యాతన్‌పల్లికి పోతరా.. లేకపోతే మా క్యాంపునకు పోతరా పోయి.. వాళ్లలో మనోధైర్యాన్ని నింపండి.. వాళ్లని కాపాడండి ప్రజాస్వామ్యా న్ని కాపాడండి.. ప్రజలిచ్చిన తీర్పును కాలరాసే ప్ర యత్నం చేస్తున్న కాంగ్రెస్‌కు కచ్చితంగా బుద్ధి చెప్పాలని కోరాడన్నారు.
వాస్తవానికి ఈ రోజు ఒక క్యాతనపల్లిలోనే కాదు రాష్ట్రం మొత్తం ఇదే నీచమైన రాజకీ యం చేస్తా ఉన్నారని, బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, కోరుకంటి చందర్, ఉమ్మడి జిల్లా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ యూత్ లీడర్ విజిత్‌రావు పాల్గొన్నారు.
దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహానికి హాజరు
మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహానికి కేటీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులు నిహారిక-రామోజీ నిశాంత్‌లను ఆశీర్వదించారు. వివాహానికి వచ్చిన కేటీఆర్‌ను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎదురేగి ఆహ్వానించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- BRS
- BRS party office
- KTR
- mancherial
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

