నిర్మల్ అర్బన్/భైంసా, మే 22 : హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన గురువారం నిర్మల్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నిర్మల్ నియోజకవర్గం నుంచి నియోజకవర్గ సమన్వయకర్త రాం కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నేతలు సమావేశానికి తరలివెళ్లారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ నేతలకు కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. పార్టీ బలోపేతనానికి పాటుపడాలని పని చేసే కార్యకర్తలు, నేతలకు పూర్తి గౌరవం ఉంటుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులంతా సిద్ధం కావాలని, జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగుర వేయాలన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, విలాస్ గాదేవార్, పడకంటి రమాదేవి, డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ పాల్గొన్నారు.