ఆసిఫాబాద్ టౌన్, డిసెంబర్ 22: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కుమారుడు కోవ సాయినాథ్ వివాహానికి బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జోగు రామన్న, సత్యవతి రాథోడ్‌తో పాటు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
వీరితో పాటు మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పురాణం సతీశ్, ఎమ్మెల్సీ దండే విఠల్ హాజరయ్యారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కోవలక్ష్మి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.