కుభీర్, జనవరి 01: కుభీర్ మండల నాయకులు భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావును మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కుభీర్ సహకార సంఘం తాజా మాజీ ఛైర్మెన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్ (Rekula Gangacharan) బృందం గురువారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో KTR కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపింది.
గులాబీ పార్టీని 2026 సంవత్సరంలో మరింత బలోపేతం చేసేందుకు పోరాట పటిమతో ముందుకు సాగాలని కేటీఆర్ తమకు సూచించినట్లు చరణ్ తెలిపారు. కేటీఆర్‌ను కలిసినవారిలో గంగాచరణ్తో పాటు ముధోల్ నియోజక వర్గ నాయకులు తెలిపారు.