ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో మే 6వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ఓ అదనపు ఎస్.పి. (అడ్మిన్) అచ్చేశ్వరరావుతో కలిసి ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీస్, వైద్య, విద్య, రవాణా, విద్యుత్, పోస్టల్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 5,252 మంది ప్రథమ, 4 ,747 మంది ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు.

పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించామని కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో జిల్లా పరీక్షల బృందం సభ్యులు నైతం శంకర్, తిరుపతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, జిల్లా విద్యాధికారి అశోక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

