హైదరాబాద్ : కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ప్రాంతంలో ఐవీఎఫ్ సెంటర్లకు ఎగ్ డోనర్లను సరఫరా చేస్తూ అధిక డబ్బుల కోసం శిశు విక్రయ దందాలోకి దిగిన నాగరాజు అలియాస్ మురుగన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 6వ తేదీన మురుగన్ గుజరాత్ రాష్ట్రంలో దేవ్ అనే బాలుడిని కిడ్నాప్ చేశాడు.
దేవ్ కిడ్నాప్ కేసును దర్యాప్తు చేస్తుండగా ఈ కిడ్నాప్ వెనుక తెలంగాణకు చెందిన ముఠా ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో మురుగన్ అదుపులోకి తీసుకొని విచారించగా సంతానం లేని దంపతులకు రూ.5 లక్షలకు శిశువులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.