MLC Anji Reddy | పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన అంజిరెడ్డి బీజేపీ సీనియర్ నాయకుడు, వన్ నేషన్వ న్ ఎలక్షన్ ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు సన్మానినంచారు. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్సీ అంజిరెడ్డి దృష్టికి అరిగెల నాగేశ్వరరావు తీసుకెళ్లారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి దృష్టి పెడతామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం జూబ్లీహిల్స్ లోని హనుమాన్ ఆలయంలో 108 టెంకాయలు కొట్టి తమ మొక్కును తీర్చుకున్నారు.