సిర్పూర్ (యు): తరతరాలుగా వస్తున్న ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ నర్సింగరావు (Narsinga rao) అన్నారు. శుక్రవారం నువ్వు శుభకార్యంలో పాల్గొన్న ఆయన ప్రజలతో మాట్లాడారు. ఆదివాసి సమాజంలో నిర్వహించబడుతున్న ప్రతి శుభకార్యం సాంప్రదాయం ప్రకారమే జరగాలన్నారు. పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో వివిధ రకాల బహుమతులు ఇచ్చే బదులు ధర్మ గురువు పండర్ కుప్పర్ లింగో, పెర్స పెన్ చిత్రపటాలను బహూకరించడం ఎంతో మంచిదని తెలిపారు.
దీని వల్ల వారి గురించి చర్చ జరుగుతుందని, ప్రతి ఒక్కరికి తెలుసుకునే వస్తుందన్నారు. ఆదివాసి సంప్రదాయాలకు పునాతన కాలం నుంచి ఎంతో ప్రత్యేక విలువలు ఉన్నాయని వెల్లడించారు. వాటిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ నాయకులు ఆత్రం చొక్కా రావు, రమేష్, జ్యోతి రాం, తదితరులు పాల్గొన్నారు.