వాంకిడి, జులై 8: అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గడ్డిమందును వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. వాంకిడి ఎస్ఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఏఎస్ఎఐ పోశెట్టి.. సిబ్బందితో కలిసి వాహనాలుతనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్ వైపు అనుమానాస్పదంగా వెళ్తున్న బైక్‌ను ఆపారు. తనిఖీ చేయగా వారివద్ద 40 లీటర్ల నిషేధిత గడ్డి మందు లభ్యమైంది. నిందితులను మంచిర్యాల జిల్లా భీమీని మండలానికి చెందిన ఇందురి అశోక్, ఇందురి చంద్రశేఖర్‌గా గుర్తించారు. గడ్డి మందును స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.