అన్ని స్థాయిల్లో బలంగా తయారు చేయడానికి కార్యాచరణ
సెప్టెంబర్ 2 నుంచి జెండా పండుగతో శ్రీకారం
గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ బలోపేతానికి చర్యలు
కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా, రైతు విభాగాల ఏర్పాటు
కమిటీల్లో సామాజిక న్యాయం పాటించేలా నిబంధన
సీనియర్లకు ప్రాధాన్యమిస్తూనే యువతకు పెద్దపీట వేసే చాన్స్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో జోష్
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ) :తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. రెండు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన పార్టీ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలంగా ఉంది. తాజాగా సభ్యత్వ నమోదు చేపట్టగా కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. కాగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా గులాబీ పార్టీ ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో పార్టీని గ్రామస్థా యి నుంచి పటిష్టమైన పునాది వేయడా నికి కార్యాచరణ రూపొందించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మా ణంపై నాయకులు దృష్టిసారించారు. వచ్చే నెల 2 నుంచి జెండా పండుగతో శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానంగా కమిటీల్లో సామాజిక న్యాయం పాటించేలా.. అన్ని స్థాయిల వారికి ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు చాలా బలంగా ఉంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టగా విశేష స్పం దన లభించింది. నియోజకవర్గానికి 50 వేల చొప్పున పది సెగ్మెంట్ల పరిధిలో దాదాపు ఐదు లక్షలకుపైగా సభ్యత్వం కలిగి ఉంది. ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు దరిదాపులో కూడా లేవు. అయినప్పటికీ గులాబీ పార్టీకి మరింత పటిష్టమైన పునా ది వేయాలని సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భా వించారు. ఈ మేరకు సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించారు. వారి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు సెప్టెంబర్ 2 నుంచి పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించను న్నారు. ఇందులో భాగంగా 12వ తేదీ వరకు గ్రామ, వార్డు, అనుబంధ కమిటీల ఎన్నికలు పూర్తి చేస్తారు. 13 నుంచి 20వ తేదీ వరకు మండల, మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కమిటీల ఎన్నికలు ఉంటాయి. 20వ తేదీ నుంచి జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్లో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు సంస్థగత ఎన్నికలు నిర్వహించి.. అన్ని స్థాయిల్లో కమిటీలను పూర్తి చేయనున్నారు.
సామాజిక వర్గాలకు ప్రాధాన్యం
టీఆర్ఎస్ గ్రామస్థాయి కమిటీలో 15 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఇందులో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఎనిమిది మంది ఉండేలా చర్యలు తీసుకుంటారు. గ్రామస్థాయితోపాటు వాటి అనుబంధ కమిటీలను కూడా ఎన్నుకుంటారు. రైతు, విద్యార్థి, యువజన విభాగం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్లను ఏర్పాటు చేస్తారు. సోషల్ మీడియా అనుబంధ కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. అనుబంధ కమిటీలు గ్రామ, మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఉంటాయి. క్రియాశీల సభ్యత్వం కలిగిన వారికి పార్టీ పదవులు కేటాయిస్తారు. కాగా.. యువతకు పెద్దపీఠ వేయనున్నారు.
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎన్నికలు
సంస్థాగత ఎన్నికలు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే యువతకు అవకాశాలు కల్పిస్తారు. ప్రస్తుతం ఎన్నుకునే కమిటీలు వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఉండనున్నాయి. రాబోయే ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని పార్టీ నిర్మాణం చేస్తున్నది. పార్టీ పదవు ల కోసం పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల వరకు ఏకగ్రీవంగానే ఎన్నిక చేసేందుకు నాయకత్వం చర్యలు చేపడుతున్న ది. పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయిలోనే సమావేశాన్ని నిర్వహించుకొని కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ కోసం పనిచేసే వారిని పాదర్శకంగా ఎన్నుకునేందుకు టీఆర్ఎస్ నాయకత్వం దృష్టిసారించింది.