ఉట్నూర్, నవంబర్ 21 : బీఆర్ఎస్ను ఆదరిం చండి.. ప్రజలకు ఎల్ల వేళలా అండగా ఉంటానని ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం ఉట్నూర్ మండలం కుమ్మరితండా, వడ్గల్పూర్, జైత్రం తండా, శ్యాంపూర్, హస్నాపూర్ గ్రామాలతోపాటు పట్ట ణంలో జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్ధన్‌తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా జాన్సన్ నాయక్‌ను ఆయా గ్రామాలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతుల తో స్వాగతం పలికి తిలకం దిద్దారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి, జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మరోసారి కేసీఆర్‌ను సీఎంగా చూడాలంటే జాన్స న్ నాయక్‌ను భారీ మెజార్టీలో గెలిపించు కోవా లని కోరారు. ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీ చారులత, సుమన్‌బాయి, సుమన్ బా యి, ప్రజ్ఞాశీల్, నాయకులు పాల్గొన్నారు. పట్ట ణంలోని ఫకీర్‌గుట్ట కాలనీలో బీఆర్ఎస్ నాయ కులు అమీనాబీ ప్రచారం చేశారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ఖానాపూర్ నియోజ కవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని కోరారు.
ఉట్నూర్ మండలంలో..
ఉట్నూర్ రూరల్, నవంబర్ 19 : మండలం లోని బిర్సాయిపేట్, దంతన్‌పెల్లి, తాటిగూడ, నర్సాపూర్(జే), కొత్తగూడ(చెక్‌పోస్ట్)తో పాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్‌తో కలిసి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. కొలాం సంఘం నాయకులకు కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జాన్సన్ నాయక్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరా రు. ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, జడ్పీటీసీ చారు లత రాథోడ్, డీసీసీబీ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డ్డి సర్పం చ్‌లు అంకవ్వ, భూమన్న, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, మాజీ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ముజీబ్, జాదవ్ సుమన్ బాయి, కాంబ్లే ప్రజ్ఞశీల్, సుఫియాన్, నాయ కులు మర్సుకోల తిరుపతి, దాసండ్ల ప్రభాకర్, కుటికెల ఆశన్న, రామగిరి వాసు, పోశన్న, మల్లారెడ్డి, ముంజం అను దీప్, కొమ్ము విజయ్, ప్రశాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. లక్కారం, సుద్దగూడ, మత్తడిగూడలో పెందూర్ పుష్పారాణి నాయకుల తో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వ హించారు. ఉప సర్పంచ్ కోల సత్తన్న, ప్రధాన కార్యదర్శి సెడ్మకి సీతా రాం, భూమన్న, దూట మహేందర్, మక్బుల్, బలవంత్, ముంజం గంగేశ్వర్, ఆశన్న, గవాస్కర్, ప్రవీణ్, మర్సుకోల సరస్వతి, పోసక్క, బబిత, రంజనాబాయి, రాజమణి, గంగరాజు, భక్తు రాజన్న, సాజిత్ సిద్ధిఖీ, కేశవ్, సురేశ్, సోము, క్రాంతి, అజ్జు, విజయ్‌నాథ్, రాజ్ కుమా ర్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దంత న్పెల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ వడ్లు తూకం వేస్తూ ఓటు అభ్యర్థించారు. శ్యాంపూర్‌లోని వార సంత లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, జాన్సన్ నాయ క్ ప్రచారం నిర్వహించారు.
ఇంద్రవెల్లిలో..
ఇంద్రవెల్లి, నవంబర్ 21 : మండలంలోని సమక, చిత్తబట్ట, అనంతపూర్, దస్నాపూర్ గ్రామాల్లో పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్ డోంగ్రే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్‌నాయక్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ షేక్ సుఫియాన్, నాయకులు కనక హనుమంత్ రావ్, ఆరేల్లి రాందాస్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, సర్పంచ్ కోవ లాల్ షావ్, ఎంపీటీసీలు కోవ రాజేశ్వర్, మడావి భీంరావ్, మీర్జా జిలానీబేగ్, ఇంద్రవెల్లి ఉప సర్పంచ్ గణేశ్టేహేరే, నాయకులు శివాజీ, ప్రకాశ్, శ్రీనివాస్, శ్యామ్కేంద్రే, హరిదాస్, ధర్ము, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం
పెంబి, నవంబర్ 21 : అన్ని వర్గాల సంక్షే మమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని బీఆర్ఎస్ సీని యర్ నాయకుడు పైడిపెల్లి రవీందర్ రావు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు, ఇటిక్యాల గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మవద్దన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి భుక్యా జాన్షన్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ జానుబాయి, బీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, సర్పంచ్ మహేందర్, నాయకులు భూక్యా గోవింద్, మహేందర్, మోహన్‌రెడ్డి, నర్సయ్య, విలాస్, సరోజ తదితరులు పాల్గొన్నారు అలాగే రాయ దారి, కర్ణంలొద్ది, ఇటిక్యాల తండాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మండల కేంద్రం లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, సర్పం చ్‌లు పూర్ణచందర్ గౌడ్, మహేందర్, కర్ణంలొద్ది ఉపసర్పంచ్ రాథోడ్ గోవింద్ పాల్గొన్నారు.
ధర్మాజీపేటలో..
కడెం, నవంబర్ 21 : ధర్మాజీపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధి కార ప్రతినిధి అమరవేణి నర్సాగౌడ్ ఆయన మాట్లాడుతూ ప్రజలు జాన్సన్ నాయక్‌ను గెలిపిం చాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అనుముల భాస్కర్, బొమ్మ లచ్చగౌడ్, కుర్ర గంగాధర్, కూచనపెల్లి నర్సయ్య, తాళ్లపెల్లి తిరుపతిగౌడ్, అమరవేణి తిరుపతిగౌడ్, శంకర్ గౌడ్, కుర్ర శేఖర్, గర్కిని గంగారాం, వేణు, నిర్మల, అనసూర్య, భీమక్క, తదితరులున్నారు.
కడెంలో..
కడెం, నవంబర్ 21 : మండలంలోని పెద్దూర్, పెద్దూర్‌తండా, కొలంగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. బీఆర్ ఎస్ అభ్యర్ధి భుక్యా జాన్సన్‌నాయక్‌ను గెలిపిం చాలని కోరారు. సర్పంచ్ అనూష, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్ హైమద్, ఉపసర్పంచ్ ఆజాం, నాయకులు హైమద్, బోయిని మంగ, ముబారక్, కాంపెల్లి రవి, చిటేటి ముత్తన్న, నల్ల గొండ, సపావత్ రవి, గౌసొద్ద్దీన్, కలీం, హాసీబ్, బొర్లకుంట రాజేశ్, కత్తర్, పాక శేఖర్, జీల నాగ రాజు, వరుణ్, సయ్యద్ షకీల్, వేణు నాయక్, జాడి నర్సయ్య, భూక్యా శేఖర్, లావుడ్య గంగన్న, రమేశ్‌నాయక్, సయ్యద్ కౌసర్, నుస్రత్, ఆర్ల రాజేశ్వరి, కరుణ, సౌత్ పాల్గొన్నారు.
గోసంపల్లెలో..
ఖానాపూర్ రూరల్, నవంబర్ 22 : గోసంపల్లె గ్రామంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తూము చరణ్, ఉప సర్పంచ్ నమెడ ధర్శరాజు ప్రచారం చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటువేయాలని గ్రామస్తులను అభ్యర్థిం చారు. లవంగాల శివ, రాజు పాల్గొన్నారు.
ఖానాపూర్‌లో..
ఖానాపూర్, నవంబర్ 21: ఖానాపూర్లోని 12వ వార్డు సుభాష్‌నగర్‌లో నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భుక్య జాన్సన్ నాయక్‌ను భారీ గెలిపించాలని మున్సిపల్ చైర్మన్ రాజేందర్ కోరా రు. కార్యక్రమంలో రామునాయక్, ప్రదీప్, మురళి, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
దస్తురాబాద్‌లో..
దస్తురాబాద్, నవంబర్ 21 : పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్య కర్తలు ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించా లని కోరారు. జడ్పీటీసీ సంతపూరి శారదా శ్రీని వాస్, ఎంపీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. కాగా రాంపూర్ గ్రామా నికి చెందిన బీజేపీ మండల ఉపాధ్యక్షుడు బూస సాయిబాబా, నాయకులు బీఆర్ఎస్లో చేరారు. అలాగే గొడిసెర్యాల గ్రామానికి చెందిన దాదాపు 200 మంది బీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఎంపీపీ సింగరి కిషన్, ఉప సర్పంచ్ ఒడిసె మాణిక్‌రావు, నాయకులు సంతపూరి శ్రీనివాస్, రాజు, శివ, తదితరులు పాల్గొన్నారు.