హాజీపూర్, ఫిబ్రవరి 18 : గుడిపేటలో నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయాన్ని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం గుడిపేటలో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం ద్వారా విద్యార్థులకు గుణాత్మక విద్య అందిస్తారన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి కేంద్రీయ విద్యాలయాన్ని సిద్ధం చేయాలని గుత్తేదారులను ఆదేశించారు.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు
లక్షెట్టిపేట, ఫిబ్రవరి 18 : ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని 30 పడకల హాస్పిటల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు, ల్యాబ్‌లు, మందుల నిల్వలు, రిజిష్టర్లను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠశాల పరిసరాలు, రిజిష్టర్లను పరిశీలించారు. ఉపాధ్యాయులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రిజిష్టర్లు, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్ పాల్గొన్నారు.
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నస్పూర్, ఫిబ్రవరి 18 : మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో స మావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మోతీలాల్, ఏసీపీ ప్రకాశ్, డీఈవో యాద య్య, డీపీవో వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.