ఇచ్చోడ, ఏప్రిల్ 29 : ‘కేసీఆర్ సభ చూశాక ప్రజలకు నమ్మకం పెరిగింది.. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అని నమ్ముతున్నరు.’ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గాంధీనగర్ గ్రామస్తులు మంగళవారం మాజీ ఎంపీపీ ప్రీతంరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో గ్రామమంతా ఏకమై బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను లోబడి మోసపోయామని తెలిపారు. కేసీఆర్ ఒక పిలుపుతో లక్షలాదిగా తరలివచ్చిన ఆ జనాన్ని చూసి మళ్లీ కేసీఆరే సీఎం అవుతారనే నమ్మకం ఉందన్నారు. సభకు ప్రజలను ఎకువ మొత్తంలో తరలించడంలో కార్యకర్తలకు జోష్ నింపడంలో కీలక పాత్ర పోషించిన మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను చూసి అభిమానంతో పార్టీలో చేరామన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ప్రీతంరెడ్డి, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ తిరుమల్ గౌడ్, మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పాండురంగ్, ఇచ్చోడ మాజీ ఉప సర్పంచ్ శిరీష్‌రెడ్డి, దీపక్, పోచాలు, సురేందర్‌రెడ్డి, నాయకులు మహేందర్‌రెడ్డి, అనిల్, రమేశ్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.