చింతలమానేపల్లి, మార్చి 16: కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో రైతుల కోసం కట్టించిన రైతు వేదికల్లోని సామగ్రి దొంగల పాలవుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలంలో పలు రైతు వేదికల్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. గత నెలలో రుద్రాపూర్‌లో రైతు వేదిక తలుపులు పగులగొట్టి, ఫర్నిచర్, ఫ్యాన్లు ఎత్తుకెళ్లా రు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఈవో విజయ్ ఫిర్యా దు చేశారు.
కాగా తాజాగా బాలాజీఅనుకోడ రైతు వేదికలోని బోర్నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మో టర్‌తో పాటు పైప్, వైర్లు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఈవో శ్రీలత ఫిర్యాదు చేశారు. మండలంలోని రైతు వేదికల్లో వ రుస దొంగతనాలు జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, ఏఈవోలు స్థానికం గా ఉండకపోవడమే కారణమనే చర్చ జరుగుతున్న ది. మండల సర్వసభ్య సమావేశంలో ఇటీవల ప్రజా ప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.