ఎదులాపురం, ఏప్రిల్ 10 : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. సోమవారం 51వ రోజుకు చేరుకుంది. 4050 మందికి కంటి పరీక్షలు చేశామని డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ తెలిపారు. 405 మందికి కండ్ల అద్దాలు అందజేశామని, 464 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం గుర్తించామని పేర్కొన్నారు.
ఇచ్చోడ(సిరికొండ), ఏప్రిల్ 10 : అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాల ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నదని సర్పంచ్ చంద్రకళ అన్నారు. సిరికొండ మండలం పొన్న గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డాక్టర్ నరేశ్ శిబిరానికి వచ్చిన వారికి కంటి పరీక్షలు చేసి అద్దాలు, మందులు అందజేశారు. కార్యక్రమంలో ఆప్తోమెట్రిస్ట్ పూజ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
వడ్గాంలో 103 మందికి కంటి పరీక్షలు
భీంపూర్, ఏప్రిల్ 10 : వడ్గాం గ్రామంలో 103 మందికి కంటి పరీక్షలు చేసి నలుగురికి అద్దాలు అందజేశామని డాక్టర్ అశ్విని తెలిపారు. ఆరుగురిని కంటి ఆపరేషన్ల కోసం గుర్తించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో ఎల్ జ్ఞానేశ్వర్, సిబ్బంది గంగాధర్, లూసి, విష్ణు, జానాబాయి పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 10 : పులిమడుగు గ్రామంలో డాక్టర్ ప్రియాంక, ఆప్తోమెట్రిస్ట్ ప్రమోదిత 128 మందికి కంటి పరీక్షలు చేశారు. అదేవిధంగా హస్నాపూర్ పీహెచ్సీ పరిధిలోని కామాయిపేట్ గ్రామంలో 115 మందికి కంటి పరీక్షలు చేశామని డాక్టర్ హరిప్రియ తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
రాజురాలో..
నేరడిగొండ, ఏప్రిల్ 10 : మండలంలోని రాజురా గ్రామంలో 101 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డాక్టర్ స్వప్న తెలిపారు. నలుగురికి కండ్ల అద్దాలు అందజేయగా ఒకరిని శస్త్ర చికిత్స కోసం రెఫర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ రాంనరేశ్, సిబ్బంది నర్సయ్య, సాయన్న, ఆశ కార్యకర్త, గ్రామస్తులు పాల్గొన్నారు.
కండ్లద్దాలిచ్చిండ్రు..
పోయిన్నెల మా కొడుకు ఆరె బాపుకు కండ్లు మబ్బు మబ్బుగా ఉన్నయ్‌రా అని సెప్పిన. పట్నం తోలుకపోయి పెద్ద డాక్టర్‌కు చూపించురా బిడ్డా అన్నా. అవ్వ ఆగు మనూరికే డాక్టర్లొత్తున్నరన్నడు. మా ఊరిలో డప్పు చాటింపు గూడా చేసిండ్రు. కండ్లు మంచిగ కనిపించనోళ్లు చూపించుకోవచ్చని పెద్దగా చెప్పిండ్రు. మన కేసీఆర్ సర్కారోళ్లు డాక్టర్లను పంపుతున్నరన్నరు. అన్నట్టుగానే పంచాయతీ వద్ద టెంట్ వేసిండ్రు. నేను గూడ పోయిన. డాక్టర్లకు సూపించుకున్న. పరీచ్చలు జేసి కండ్లద్దాలు ఇచ్చిండ్రు. గిప్పుడు కండ్లు మంచిగ కనిపిస్తున్నయ్. పాణం నిమ్మలమైతంది. – రాథోడ్ లలితాబాయి, కాల్వతండా (దిలావర్పూర్)