అభివృద్ధికి కేరాఫ్ కామోల్
మా గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి జరిగింది. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తున్నారు.
- రూపురేఖలు మార్చుకున్న గ్రామ పంచాయతీ
- అన్ని రకాల పనులతో దూసుకుపోతున్న జీపీ..
- నిధుల వినియోగంలో ఆదర్శం..
- ఇంటింటా సంక్షేమ పథకాలు
- సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
కామోల్.. గ్రామం అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడిన ఈ పల్లె.. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. అన్ని రకాల నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఎటు చూసినా అన్ని రకాల పనులు పూర్తిచేసుకున్న ఈ పంచాయతీ.. తన రూపురేఖలన్నీ మార్చుకున్నది. ఇంటింటా ఏదో ఒక సంక్షేమ పథకం అందుతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– భైంసాటౌన్, జనవరి 2
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి..
మా గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి జరిగింది. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తున్నారు. నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయించారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ పకడ్బందీగా అమలు చేయడంతో, వార్డు సభ్యుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాం.గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకెల్తున్నాం. పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ముత్తవ్వ, సర్పంచ్, కామోల్
అన్ని సౌకర్యాలు కల్పించారు..
గతంలో మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఓట్లు వేయించుకున్న నాయకులు గెలిచిన తర్వాత మా వంక కూడా చూడలేదు. తెలంగాణ ప్రభుత్వంలో సర్పంచ్, ఎమ్మెల్యే మా గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. అన్ని సౌకర్యాలు కల్పించారు. తెలంగాణ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు. వర్షం పడితే మొత్తం బురదమయమయ్యేది. సీసీ రోడ్లు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తప్పాయి. శ్మశానవాటిక, స్నానాలు చేసేందుకు వేర్వేరు గదులు నిర్మించారు. దీంతో ఏళ్ల నుంచి పడుతున్న ఇబ్బందులు తప్పాయి.
– విఠల్, గ్రామస్తుడు, కామోల్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

