దండేపల్లి, జూన్22 : మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో శనివారం జ్యేష్ఠపౌర్ణమి జాతర వైభవంగా సాగింది. ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న భక్తు లు సమీప గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. గుట్టపైనున్న సత్యదేవుడిని దర్శించుకున్నారు.
ఆలయంలో 169 జంటలు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం భక్తులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది ఉన్నారు.