ఖానాపూర్, జూన్ 12 : బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో శుక్రవారం బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మలేషియా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన కేటీఅర్ను కలిసి ఖానాపూర్ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ పురోగతితో పాటు పలు కీలక రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం ఇటీవల జరిగిన భూక్యా జాన్సన్ నాయక్ జన్మదినాన్ని పురసరించుకుని కేటీఆర్ ఆయనను శాలువాతో ఘనంగా సతరించి శుభాకాంక్షలు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రజా సేవలందిస్తున్నందుకు జాన్సన్ నాయక్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.