ఖానాపూర్, మార్చి 5 : కడెం మండలంలోని లింగాపూర్‌కు చెందిన నరేశ్, భాస్కర్, శంకర్, రాజేశ్వర్, శ్రీనివాస్.. దస్తురాబాద్ మండలంలోని మున్యాలకు చెందిన రవీందర్‌లు యే డాది క్రితం ఉపాధి కోసం మలేషియా వెళ్లా రు. వీరు విజిటింగ్ వీసాతో వచ్చి పనిచేస్తూ పోలీసులకు చిక్కారు. వీరిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ విషయాన్ని వారం రోజుల క్రితం జైలు పాలైన వారి కుటుంబ సభ్యులు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్‌కు తెలిపారు. స్పందించిన జాన్సన్ నాయక్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో బాధితుల కోసం రెండు రోజుల క్రితం మలేషియా దేశానికి వెళ్లారు. అక్కడి అధికారులతో మాట్లాడి విడుదల చేయాడానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని జాన్సన్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు జాన్సన్ నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.