ఎదులాపురం, జూన్ 21 : తెలంగాణ ఆత్మగౌర వం కోసం నిరంతరం అవిశ్రాంతిగా పోరాటం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం జయశంకర్14వ వర్ధంతి కార్యక్రమాన్ని పురసరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక తెలంగాణ తల్లి చౌక్‌లో గల జయశంకర్ సార్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.
పూలమాలలు వేసి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. సార్ చేసిన నీటి జలాల ఉద్యమం ఫలితమే నేడు ఇం టింటికీ మిషన్ భగీరథ తాగునీటిని అందిపుచ్చుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో యూనిస్ అక్బనీ, మెట్టు ప్రహ్లాద్, పట్టణ అధ్యక్షులు అజయ్, అశోక్ స్వామి, ఇజ్జగిరి అశోక్, మేస్త్రం పరమేశ్వర్, పురుషోత్తం, దమ్మాపాల్, అన్నెలా వసంత్, అంజాత్, నవతే శ్రీనివాస్, జంగిలి ప్రశాంత్ పాల్గొన్నారు.