జైనథ్, మే 2 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు హయంలో రాష్టంలో ఆలయాల నిర్మాణాలను పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన అభివృద్ధికి కృషి చేసిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కరంజి గ్రామంలో నూతన నంద మైసమ్మ ఆలయ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామస్తులు శాలువాతో ఘనంగా సతరించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఆలయాల నిర్మాణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని గుర్తు చేశారు. గ్రామాల్లో అంటు వ్యాధులు దరిచేరకుండా గ్రామదేవతలు కాపాడుతాయని దృఢమైన నమ్మకంతో ఆనవాయితీగా పూజించడం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట మారిశెట్టి గోవర్ధన్, మహేందర్ రెడ్డి, బికి రవీందర్, తల్లా పెళ్లి గంగన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.