ఎదులాపురం, ఏప్రిల్ 12 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో మొట్టమొదటి సారి ఆలయాల నిర్మాణాలను ప్రభుత్వ నిధులతో చేపట్టడం సాధ్యమైదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం హనుమాన్ జయంతిని పురసరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని పలు హనుమాన్ ఆలయాలను సందర్శించారు. ప్రతేక పూజలు నిర్వహించారు.
నిర్వాహకులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి శాలువాతో సతరించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, కొండ గణేశ్, బట్టు సతీశ్, ఉగ్గే విఠల్, అన్నెలా వసంత్, నవతే శ్రీనివాస్, ప్రశాంత్, వినోద్ పాల్గొన్నారు.