ఎదులాపురం, మే 21 : ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డులో నూతనంగా ఏర్పాటు చేసుకున్న రెడ్డి సంఘ నూతన భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెడ్డి సంఘ సభ్యులు జోగు రామన్నని ఘనంగా ఆహ్వానించి శాలువాతో సతరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రామన్న మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రస్థానంలో మొదటి గురువులు రెడ్డి బంధువులేనని గుర్తు చేశారు.
వారు అందించిన ప్రోత్సాహంతో రాజకీయంగా అనేక పదవులను పొందానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి సంఘాలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించే సదుద్దేశంతో సంఘ భవనాలను ఏర్పాటు చేసే దిశగా ఆయా సంఘాల భవనాలకు స్థలాలను కేటాయించామన్నారు. సంఘ భవనాల ద్వారా ఆయా సంఘంలో ఆర్థిక వెసులుబాటు తోపాటు సంఘ సభ్యులకు మరిన్ని సేవలు అందించొచ్చని కేసీఆర్ ఆలోచన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.