భీంపూర్, అక్టోబర్ 27 : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేసిందని, ఎన్నికల్లో అభివృద్ధి చూసి బీఆర్ఎస్కి పట్టం కట్టాలని, కాంగ్రెస్ ఓటు వేస్తే కరెంట్ కష్టాలు తప్పవని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. శుక్రవారం భీంపూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బోథ్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి గొడాం నగేశ్ , బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ నిర్వహించిన, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి హాజరయ్యారు.
కార్యకర్తలకు దిశానిర్ధేశనం చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నల్లచట్టాలతో రైతులకు వ్యతిరేకి అయి అబాసుపాలైందని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్ అవసరం లేదని, రైతుబంధును అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బోథ్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధికి కారు గుర్తుకు ఓటేసి జాదవ్ అనిల్‌ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎంపీ, బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి నగేశ్ మాట్లాడుతూ భీంపూర్ మండలంలో 8090 మంది కుటుంబాలకు రైతుబంధు వస్తున్నదని ఇలా సగటున ప్రతి కుటుంబానికి సీఎం కేసీఆర్ రెండు పథకాలు ఇస్తున్నారని గుర్తుచేశారు. సమగ్ర అభివృద్ధికి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని కోరారు.
బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ మాట్లాడుతూ తాను గెలిచిన తర్వాత మండలంలో గోముత్రి రిజర్వాయర్, అర్లి చెరువు, కరంజి, గుబిడి రోడ్డు సహా మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణాత్మకంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా మండలంలోని నిపాని ఎక్స్ రోడ్డు నుంచి భీంపూర్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు ,యువకులు,రైతులు బైక్ ర్యాలీ తీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ స్వాగతించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు కుమ్ర సుధాకర్, తాటిపెల్లి రాజు, ఎంపీపీలు కుడిమెత రత్నప్రభ ,తుల శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా ప్రతినిధి, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న , బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య యాదవ్, సర్పంచ్‌లు, నాయకులు బక్కి సురేందర్, గోవర్ధన్‌యాదవ్, నరేందర్యాదదవ్, షేక్ అఫ్రోజ్, జహూర్ అహ్మద్, సంజీవ్‌రెడ్డి , మొట్టె కిరణ్, మార్సెట్టి అనిల్, కల్చాప్యాదవ్ ,కపిల్, వివిధ గ్రామాల కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
భీంపూర్‌లో ఎంపీపీ కుడిమెత రత్నప్రభ సంతోష్ , సర్పంచ్ మడావి లింబాజీల ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన సూర్యవంశీ రాజ్గోడ్, 130 మంది, బేల్సరిరాంపూర్కు చెందిన 100 మంది కాంగ్రెస్, బీజేపీల నాయకులు, గిరిజన యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి గొడాం నగేశ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, అభ్యర్థి జాదవ్ అనిల్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
తాంసి, అక్టోబర్ 27: తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ తాటిపల్లి రాజు, ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ప్రచారానికి వచ్చిన జాదవ్ అనిల్‌కు మహిళలు మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఓట్ల కోసం ప్రజలను మోసగించడానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తారని వారిని తరిమికొట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు స్వప్న రత్న ప్రకాశ్, కన్వీనర్ తారూడి అరుణ్‌కుమార్, వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు, నాయకులు రజినీకాంత్ రెడ్డి, లింగారెడ్డి, పరమేశ్, గోవర్ధన్ రెడ్డి, సిరిగిరి దేవేందర్, ఖమర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ ధనుంజయ్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు దయానంద్, కార్యకర్తలు పాల్గొన్నారు.