ఎదులాపురం, సెప్టెంబర్ 26: చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం, మహనీయుల చరిత్రను ప్రజలకు తెలియజేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం తెలంగాణ వీరనారీ చాకలి ఐలమ్మ 130వ జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. రిమ్స్ ఎదుట గల ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ రాజర్షిషా, అధికారులు, మాజీ మంత్రి జోగురామన్న, ప్రజాప్రతినిధులు, రజక సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకు ముందు రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం, పెత్తందారులు, భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో అధికారికంగా ఐలమ్మ జయంతి, వర్థంతి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించినట్లు తెలిపారు. పాలకూర్తి మారెట్‌కు ఐలమ్మ పేరు పెట్టామని గుర్తు చేశారు. చేతివృత్తుల వారికి రుణాలతో పాటు రజకులు, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. మహనీయులను స్మరించుకునేందుకు జయంతులు, వర్థంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కే రాజలింగు, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, మాజీ మంత్రి జోగు రామన్న, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ జడ్పీ చైర్మన్ చిట్యాల సుహాసిని రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనిషా పవన్‌రావు, బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షుడు చికాల దత్తు, రజక సంఘం పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్, వినోద్, సామాజికవేత్త ముడుపు మౌనిష్ రెడ్డి తదితరులున్నారు.
బోథ్, సెప్టెంబర్ 26 : భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం ఐలమ్మ జయంతి సందర్భంగా బోథ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ మేరకు బోథ్‌లో దోభిఘాట్ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, సంధ్యారాణి, తుల శ్రీనివాస్, స్వామి, శ్రీధర్‌రెడ్డి, సురేందర్ యాదవ్, సుభాష్, ఎలుక రాజు, రమణ గౌడ్, శ్రీధర్ రెడ్డి, ప్రశాంత్, ప్రవీణ్, బాపురెడ్డి, రూప్‌చంద్, రఫీ, శేమిందర్ పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, సెప్టెంబర్, 26 : చాకలి ఐలమ్మ పోరాటం మరువలేనిదని నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, వివిద శాఖల అధికారులు రజక సంఘం అధ్యక్షుడు ఏ. నర్సయ్య, నాయకులు శ్రీనివాస్, చట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.