ఆదిలాబాద్ : పంటల సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంట దిగుబడులలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వారిని జాగృతం చేసేందుకు రైతు సంఘం నాయకులతో కలిసి పంట పొలాలను సందర్శిచారు . జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో తన సొంత పొలంలో నాటు వేశారు. ప్రయోగాత్మకంగా పంటలో కలిగే నష్టాలను ఎలా నివారించాలి అనే కోణంలో రైతులకు అవగాహన కల్పించేందుకు దృష్టి సారించారు.
ఈ మధ్యకాలంలో పంటలపై వాతావరణ ప్రభావంతో పలు రకాల తెగుళ్లు సోకి పంటలకు నష్టం వాటిల్లుతుం దన్నారు. అలాగే పంటలు మార్కెట్లోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం కనీస ధరను ప్రకటించకుండా రైతులను మోసం చేస్తుందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించి రైతుల నష్టాలని కూడా ప్రభుత్వం భరించిందని గుర్తు చేశారు. ఆయన వెంట గోవర్ధన్ యాదవ్, లక్ష్మణ్, బట్టు సతీష్, నల్ల మహేందర్, కాసర్ల అశోక్, పట్టెపు విలాస్, రామన్న, నల్ల రామన్న, విఠల్ గేడ, పట్టేపు అశోక్, సీహెచ్ ఇస్తారి, అగ్గు దేవన్న, తదితరులు ఉన్నారు.