నేరడిగొండ, సెప్టెంబర్ 15 : సీఎం కేసీఆర్ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో పలు ఆలయాల భక్తులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. తేజాపూర్ పరిధిలోని లఖంపూర్ గ్రామంలో శ్రీ రామాలయ నిర్మాణానికి రూ.50 లక్షలు, చిన్న బుగ్గారంలోని జగదాంబదేవి, సేవాలాల్ మహారాజ్ ఆలయాలకు రూ.12 లక్షలు, గుడిహత్నూర్ మండలంలోని లింగాపూర్‌లోని హనుమాన్ ఆలయానికి రూ.50 లక్షలు, మండలంలోని కుంటాల(కే)లోని జగదాంబదేవి, సేవాలాల్ ఆలయాలకు రూ.43 లక్షల నిధులు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా మంజూరు కావడంతో ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఆలయాలకు నిధులు మంజూరుకు కృషి చేసిన మంత్రి ఐకేరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తేజాపూర్ గ్రామ పెద్దలు భూమారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింగ్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ప్రదీప్, ప్రతాప్‌రెడ్డి, నేరడిగొండ సర్పంచ్ వెంకటరమణ, ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పేద ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. నేరడిగొండ మండలం కుమారి గ్రామంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు, పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ గంగేశ్వర్, మండల కోఆర్డినేటర్ కుంట కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు వెంకటరమణ, స్థానిక సర్పంచ్ రాజుయాదవ్, ఉపసర్పంచ్ నరేశ్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, మాజీ జడ్పీటీసీ భీంరెడ్డి, నాయకులు కమలాకర్‌రెడ్డి, అరుణ్గౌడ్, శ్రీనివాస్, నారాయణగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, సెప్టెంబర్ 15 : మండలంలోని ముక్రా(కే) గ్రామంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పంపించిన విత్తన గణపతులను బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాదవ్ అనిల్ మాట్లాడుతూ పర్యావరణ నష్టాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే విత్తన గణపతుల పంపిణీకి గ్రీన్ ఇండియా చాలెంజ్ ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రజలు వీలైనంత వరకు విత్తన మట్టి ప్రతిమలను కొలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆశయం మేరకు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఈ విత్తనాలతో కూడిన మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ముక్రా(కే) గ్రామానికి విత్తన గణపతులు పంపిస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌కు సర్పంచ్ గాడ్గె మీనాక్షి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతమ్‌రెడ్డి, సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, నవేగాం సర్పంచ్ పాండురంగ్, సాబీర్, రమేశ్, పోశాలు, మహేందర్, వెంకటరమణ, దేవేందర్ రెడ్డి, భీం రెడ్డి, కలీం, గ్రామస్తులు పాల్గొన్నారు.