ఇంద్రవెల్లి, మే 5 : ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు శాలువాతో సన్మానించారు. మెస్రం వంశీయులతో సమావేశమై నాగో బా దేవత చారిత్రక ప్రాధాన్యం, సంప్రదాయాలపై అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పీవో మా ట్లాడుతూ. గిరిజన ప్రాంతాల్లో విద్యా అభివృద్ధితోపాటు ఆదివాసుల సంస్కృతి రక్షణకు ప్రత్యేక చర్య లు తీసుకుంటామన్నారు. మెస్రం వంశీయులు పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, కెస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారాం, ఆలయ చైర్మన్ నంద్రావ్, ఆలయ పూజారి శేఖు, ఈవో రవీకుమార్, మెస్రం వంశీయులు కటోడ కోసేరావ్, మనోహర్, దేవ్రావ్, నాగోరావ్, భీంరావ్, ధర్ము, జంగు పాల్గొన్నారు.