చెన్నూర్, నవంబర్ 26 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం చెన్నూర్ పర్యటనకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్‌కు మద్దతుగా పట్టణంలో నిర్వహిస్తున్న రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు.
అనంతరం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వద్ద రోడ్‌షోలో ఆయన ప్రసంగిస్తారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా చెన్నూర్‌కు చేరుకుంటారు. కావున బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి కేటీఆర్ రోడ్‌షోను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు కోరారు.