బడి బస్సు భద్రమేనా?.. ఫిట్నెస్ లేకుండానే రహదారులపైకి వాహనాలు
నిర్మల్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు బస్సుల ఫిట్నెస్పై యాజమాన్యాలు దృష్టి సారించకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నది. 15 ఏండ్లకు పైబడి కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై తిప్పుతున్నారు.
- ఇటీవల 12 బస్సులపై ఫిట్నెస్ కేసులు
నిర్మల్ అర్బన్, జూన్ 25 : నిర్మల్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు బస్సుల ఫిట్నెస్పై యాజమాన్యాలు దృష్టి సారించకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నది. 15 ఏండ్లకు పైబడి కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై తిప్పుతున్నారు. ఇంకా.. ఇతర రాష్ర్టాల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వాహనాలకు పైన రంగులు అద్దుతూ రోడ్లపై తిప్పుతున్నారు. ఇటువంటి బస్సుల వల్ల నిర్మల్ జిల్లాలో చాలా ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగినా తమకు ఏం పట్టింపు లేదన్నట్లు వాహనాలను నడిపిస్తున్నారు.
ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాలు..
- నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గాం చౌరస్తాలో నిర్మల్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సులో మంటలు వ్యాపించాయి. ఆస్తి, ప్రాణ నష్టం ఏం జరగలేదు.
- సిద్ధాపూర్ వద్ద ఓ పాఠశాలకు చెందిన ప్రైవేటు బస్సు రోడ్డు నుంచి అదుపు తప్పింది. పక్కనే లోయ ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.
- నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ కాలనీ శివారులోని పొలాల్లోకి బస్సు దూసుకెళ్లింది. నటరాజ్ మిల్ సమీపంలో విద్యార్థులను తీసుకెళ్లే టాటా మ్యాజిక్ వాహనంలో మంటలు చెలరేగాయి. స్థానికులు స్పందించింది వాహనం నుంచి విద్యార్థులను కిందికి దింపారు.
నిర్మల్ జిల్లాలో 285 స్కూల్ బస్సులు
నిర్మల్ జిల్లాలో 285 ప్రైవేటు పాఠశాల బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 220కిపైగా బస్సులు ఫిట్నెస్ పూర్తి చేసుకోగా.. మిగిలిన బస్సులు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. పాఠశాలల ప్రారంభానికి ముందే ఫిట్నెస్ చేయించాల్సి ఉండగా.. బస్సు యజమానులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులపై విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 12 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. నిర్మల్ పట్టణంలో గత మంగళవారం ఎంవీఐ అధికారులు పది బస్సులను తనిఖీ చేసి మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో ఖానాపూర్లో ఏడు బస్సులు తనిఖీ చేసి రెండు కేసులను నమోదు చేశారు. భైంసాలో 15 బస్సులను తనిఖీ చేసి మూడు కేసులను నమోదు చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

