ఇంద్రవెల్లి, మే 17 : ఇంద్రవెల్లి మండలంలోని గిన్నేరా పంచాయతీ పరిధిలోని చెరువులో పుష్కలంగా నీళ్లు ఉన్నా.. రైతులకు ఉపయోగంలోకి రాకపోవడంతో అలంకార ప్రా యంగా దర్శనమిస్తున్నది. చెరువుతోపాటు చెరువుకు రెండు వైపులా ఉన్న కాలువలు కో తకు గురి కావడంతోపాటు మట్టితో మొత్తం నిండిపోయి ఆధ్వానంగా కనిపిస్తున్నాయి. కాలువలు ఉన్న ఆయకట్టు కిందికి ఉన్న వ్యవసాయ భూములకు సాగునీరు అందడం లేద ని రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
చెరువులో పుష్కలంగా నీరు ఉన్నా కాలువలు సరి గా లేకపోవడంతో ఆయకట్టు రైతులకు ఆ నీరు ఉపయోగంలో లేకుండాపోయింది. దీం తో రైతులు వర్షధారిత పంటలు వేస్తున్నారు. గిన్నేరా చెరువుతో గిన్నేరా, మర్కాగూడ, తో యగూడ, కొలాంగూడ, బీక్కుతండా గ్రామాలకు చెందిన రైతుల వ్యవసాయ భూములకు సాగునీరు అందించడానికి గత ప్రభుత్వం 2009లో రూ.3.50 కోట్లతో కాలువలు నిర్మించారు. ఈ చెరువుల ఆయకట్టు కిందిలో ఉన్న సుమారు 600ల ఎకరాల భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించినట్లు అధికారులు తెలుపుతున్నారు.
చెరువుకు రెండు వైపులా కాలువలు నిర్మించి రెండేళ్లుగా ఆయకట్టు రైతుల వ్యవసాయ భూములకు సాగునీరు అందించారు. అనంతరం అధికారుల పర్యవేక్షణ ఆ చెరువుపై సరిగా లేకపోవడంతో కాలువలు మట్టితో పుడ్చిపోయి, కోతలకు గురై, తూములు మూసుకుపోయి ఆధ్వానంగా మారాయి. పుష్కలంగా నీళ్లు ఉన్న గిన్నేరా చెరువుపై సంబందిత శాఖల అధికారులు దృష్టి సారించి చెరువుతోపాటు తూములు, కాలువలకు మరమ్మతులు చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
