దహెగాం, మే 18 : పెంచికల్పేట్ అడవుల్లోని ఎల్లూరు అటవీ ప్రాంతంలో ఏడేళ్ల వయసున్న ఆడపులికి విద్యుత్ షాక్ పెట్టి హతమార్చిన విషయం విదితమే. ఈ కేసు విచారణలో భాగంగా పలువురు అటవీశాఖ అధికారులు దహెగాం మండలం ఖర్జీ,గెర్రె,చిన్నరాస్పల్లి, ఒడ్డుగూడ, దహెగాంకు చెందిన సుమారు 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విచారణ తర్వాత వారిని వదిలేసినట్లు సమాచారం?.
కొందరి సెల్ఫోన్లను అధికారుల వద్దే ఉంచుకొన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఓ వ్యక్తిని మాత్రం తమ అదుపులోనే ఉంచుకొని విచారణ చేస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. కాగా, 2021 లో మహారాష్ట్ర పెద్దపులి మృతి చెందగా, అప్పుడు కూడా ఓ గ్రామానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.