శ్రీరాంపూర్, ఫిబ్రవరి 12 : శ్రీరాంపూర్ ఎస్సార్పీ-1గనికి చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు కొట్టె వెంకటేశ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై ఐఎన్టీయూసీ నాయకులు, కార్మికులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు సోమవారం ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జే శంకర్రావు, కుమారస్వామి, డిప్యూటీ ప్రధా న కార్యదర్శి గరిగె స్వామి ఆధ్వర్యంలో ర్యాలీ తీసి.. గనిని ముట్టడించారు. మేనేజర్ వేధింపులు తాళలేకే కొట్టె వెంకటేశ్ ఆత్మహత్యాయ త్నం చేశారని, దీనిపై యాజమాన్యం వెంటనే స్పందించాలని, ఇకపై వేధింపులు ఉండవని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. దీంతో గని ఏజెంట్ గోపాల్‌సింగ్, మే నేజర్ విజయ్‌కుమార్ నాయకులతో మాట్లాడుతూ ఉత్పత్తి, ఉత్పాదకతకు అనుగుణంగానే కార్మికుల విధుల్లో మార్పులు చేశామన్నారు.
ఏఐటీయూసీ నాయకులు చెప్పిన వారిని మాత్రమే షిఫ్టుల్లోకి మార్చడమేమిటని ప్రశ్నించారు. దీంతో గనిపైకి చేరుకున్న ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బా జీసైదా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే వీరభద్రయ్య, సహాయ కార్యదర్శి కొమురయ్య మాట్లాడుతూ కార్మికుల షిఫ్టుల మార్పునకు.. ఏఐటీయూసీకి సంబంధం లేదన్నారు. కాసేపు ఐఎన్టీయూసీ, ఏజెంట్ గోపాల్‌సింగ్, ఏఐటీయూసీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు జీఎం చర్చలకు పిలవడంతో ఆందోళన సద్దుమణిగింది. ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్, ఉపాధ్యక్షుడు శంకర్రావు, కలవేణ శ్యాం చర్చలు జరిపారు. పాత కార్మికులను.. వారు చేస్తున్న పనుల్లోనే కొనసాగిస్తామని జీఎం సంజీవరెడ్డి హామీ ఇచ్చారు. నాయకులు నీలం సదయ్య, తిరుపతిరావు, అన్రెడ్డి తిరుపతిరెడ్డి, సమ్మయ్య, వెంకటేశ్, చిన్నయ్య, కుమారస్వామి, రాజన్న, మహిపాల్‌రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.