బీజేపీ అంటే బడా ఝూటా పార్టీ.. అని ఆ నాయకులంతా అబద్ధపు పునాదుల మీద బతుకుతున్నారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు విషయాలు వెల్లడించారు. సింగరేణి బొగ్గు గనులను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే కుట్రను, తెలంగాణపై వ్యతిరేక విధానాలను ఆ పార్టీ నేతలు గమనించే బయటకు వస్తున్నారని స్పష్టం చేశారు. ఇటీవల బీజేపీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్‌తోపాటు మరో 8 మంది ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కాషాయ పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
మంచిర్యాల, ఫిబ్రవరి 22, నమస్తే తెలంగాణ : బీజేపీ అం టే బడా జూటా పార్టీ.. ఆ పార్టీ నేతలం తా అబద్ధపు పునాదుల మీద బతుకుతున్నారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మం చిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు వివరాలు వెల్లడించారు.
నమస్తే తెలంగాణ : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు కదా.. ఎలాంటి అనుభూతి పొందుతున్నారు?
విప్ సుమన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అధ్యక్ష పదవి అప్పగించడంతో బాధ్యత మరింత పెరిగింది. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాను.
నమస్తే : జిల్లాలో ప్రత్యర్థి పార్టీల పరిస్థితి ఎలా ఉంది?
విప్ సమన్ : మంచిర్యాల జిల్లాలో ప్రత్యర్థి పార్టీల ఉనికే లేదు. 2014, 2018 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. జిల్లా పరిషత్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్సే కైవసం చేసుకుంది. జిల్లాలోనే ఏకపక్షంగా బలమైన పార్టీగా టీఆర్ఎస్ ఉంది.
నమస్తే : జిల్లా అధ్యక్షుడిగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు?
విప్ సుమన్ : టీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాం. గ్రామ, మండల, పట్టణ, విద్యార్థి, యువజన, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ.. తదితర సంఘాలు ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతా ల్లో సైతం పార్టీని పటిష్టం చేస్తాం.
నమస్తే : జిల్లాలో ఇటీవల ఎమ్మెల్యేల నేతృత్వంలో సామూహిక నిరసన దీక్షలు ఎందుకు చేపట్టారు?
విప్ సుమన్ : సింగరేణిని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు మోదీ సర్కారు చేస్తున్న కుట్రను తిప్పి కొట్టేందుకు మా అధిష్టానం సూచనల మేరకు నిరసన దీక్షలు చేపట్టాం. తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి మీద ఈ మధ్యకాలంలో నరేంద్రమోదీ కన్నుపడ్డది. కోయగూడెం, సత్తుపల్లి, కేకే 6, శ్రావణ్‌పల్లి ఓసీ బొగ్గు గనులను వేలానికి పెట్టే కుట్ర చేస్తున్నరు.
నమస్తే : బీజేపీకి నేతలు రాజీనామా చేయడంపై మీ కామెంట్?
విప్ సుమన్ : మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను బీజేపీ నేతలు గమనిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా చాలా మంది బీజేపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఉన్నరు. సింగరేణికి బీజేపీ సర్కారు తలపెట్టిన అన్యాయం, ప్రైవేటీకరణపై వారు మండిపడుతున్నరు. సింగరేణి బొగ్గు బ్లాకు గనులను వేలం వేయడం ఆపాలని స్వయానా మా ముఖ్యమంత్రి ప్రధాని మో దీకి లేఖ రాసినా పట్టించుకోకపోవడం, మా రాష్ట్రమంత్రి కేటీఆర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాసినా పట్టించుకోకపోవడం దారుణం. వీటిపై కార్మికుల తీవ్ర కోపంతో ఉన్నారు.
నమస్తే : తెలంగాణకు చాలా చేశామని బీజేపీ చెబుతున్నది కదా అందులో నిజమెంత?
విప్ సుమన్ : బీజేపీ అంటే బడా జూటా పార్టీ.. ఆ పార్టీ నాయకులంతా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుంటారు. అబద్ధపు పునాదుల మీదే వా రు బతుకుతున్నరు. వాట్సాప్, ఫేక్ యూనివర్సిటీలతో ప్రజలను గందరగోళ పరుస్తున్నరు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే చేస్తున్నది. తెలంగాణ వడ్లు కొనబోమంటున్నరు. తెలంగాణకు నిధులిస్తలేరు. ఇవే కాకుండా స్వయంగా ప్రధానమంత్రి మోదీ లోక్ సభలో, రాజ్య సభలో తలుపులు మూసి తెలంగాణ బిల్లును పాస్ చేసిన్రని మాట్లాడడం దారుణం. అందుకే తెలంగాణపై ప్రేమ ఉన్న బిడ్డలెవరూ ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. రాజీనామాలు చేసి బయటకు వస్తున్నరు. ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే రోజులు దగ్గరపడ్డయి. ఇది ఖాయం.
నమస్తే : సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమంపై మీ అభిప్రాయం?
విప్ సుమన్ : సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నరు. బంగారు తెలంగాణ కో సం అహర్నిశలూ కృషి చేస్తున్నరు. ప్రస్తు తం దేశా న్ని బాగుచేయాలని కంకణం కట్టుకున్న రు. రై తుల కోసం ఏ రాష్ట్రమూ చేయనంత తెలంగాణనే చేస్తున్నది. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, సకాలంలో ఎరువుల పంపిణీతో దేశంలో మోడల్‌గా నిలుస్తున్నరు. క ల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అద్భుత పథకాలతో పేదల ఇండ్లల్లో పెండ్లికి పెద్దన్నలా ఉంటున్నరు. కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా, దళిత బంధు.. వంటి మహోన్నత పథకాలతో సబ్బండ వర్గాలకు అండగా ఉంటున్న రు. ప్రభుత్వ బడుల బలోపేతానికి, నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యకోసం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన్రు. పేదలకు ఇం గ్లిషు విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నరు.