పార్కింగ్చే సిన వాహనాలే
హైవేలపై నిర్మానుష్య ప్రదేశాలలో పార్ చేసిన భారీ వాణిజ్య వాహనాలే లక్ష్యంగా చేసుకొని అంతర్రాష్ట్ర స్థాయిలో చోరీలకు పాల్పడుతున్న భారీ వాహన దొంగల ముఠాను మావల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
- పది మందిపై కేసు, ముగ్గురు అరెస్ట్
- వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
ఎదులాపురం, మే 28 : హైవేలపై నిర్మానుష్య ప్రదేశాలలో పార్ చేసిన భారీ వాణిజ్య వాహనాలే లక్ష్యంగా చేసుకొని అంతర్రాష్ట్ర స్థాయిలో చోరీలకు పాల్పడుతున్న భారీ వాహన దొంగల ముఠాను మావల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రంలోని పల్వాల్ జిల్లాకు చెందిన ట్రక్ డ్రైవర్ సలీం, మేవాత్ జిల్లాకు చెందిన నఫీస్ ఖాన్, భరత్పూర్ జిల్లాకు చెందిన మెకానిక్ ఇంతాజ్ హుస్సేన్‌లు టయోటా కారులో సంచరిస్తూ హైవేలు, పెట్రోల్ బంకుల వద్ద పార్ చేసిన భారీ వాహనాలను గుర్తించి దొంగిలించేవారు.
ఈ ముఠా ఐషర్, టిప్పర్ వంటి భారీ వాహనాలను దొంగిలించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు తరలించి విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఒకరోజులో పూర్తిగా విడిభాగాలుగా విడగొట్టి ఒకొక భాగాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లుగా వివరించారు. గత రాత్రి మావల బైపాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు ప్రయాణిస్తున్న టయోటా కారును పోలీసులు అనుమానంతో ఆపగా పరారయ్యేందుకు ప్రయత్నించారు.
వెంటనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి టయోటా కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరు పర్చగా.. జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న ఏడుగురికి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతున్నట్లు పేరొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, మావల సీఐ ప్రేమ్‌కుమార్, డబ్ల్యూ పీఎస్ ఇన్స్పెక్టర్ ఫణిదర్, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, ఎస్ఐ శ్రీకాంత్, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ గోపీకృష్ణ, వన్‌టౌన్ పీసీ నరేష్, సైబర్ సెల్ పీసీ త్రిశూల్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

