నిర్మల్ అర్బన్, మార్చి 5 : నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకున్నారు. జిల్లా వ్యా ప్తంగా 6,323 మంది విద్యార్థులు పరీక్షకు ద రఖాస్తు చేసుకోగా..5,971మంది హాజరయ్యారు. 352 మంది గైర్హాజరయ్యారు. ఓకేషనల్‌లో 539 మందికి 82 మంది గైర్హాజరయ్యారని డీఐఈవో పరశురాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఆదిలాబాద్‌లో 9,154 మంది హాజరు
ఎదులాపురం, మార్చి 5 : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలను ఏర్పాటు చేసి వసతులు కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగింది. నిమిషం నిబంధన సడలించి ఐదు నిమిషాలు చేయడంతో విద్యార్థులు సమయం కంటే గంట ముందే కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం పరీక్షకు 9,814 మందికి 9,154 మంది హాజరు కాగా.. 660 మంది గైర్హాజరయ్యారని డీఐఈవో జాదవ్ గణేశ్ తెలిపారు. పట్టణంలోని ఆయా పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా సందర్శించి వసతులను పరిశీలించారు.