ఆదిలాబాద్, అక్టోబర్ 4 ( నమస్తే తెలంగాణ) : బేల మండలం కాంగార్పూర్ పెన్‌గంగా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు సంబంధిం చి ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ‘నిండు గా నీళ్లు పడవలతో ఇసుక వెలికితీత’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రెవెన్యూ, మైనింగ్, పోలీసు అ ధికారులు నది పరిసరాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
నది పక్కన చెట్లలో ఉం చిన ఆయిల్ ఇంజిన్లతో కూడిన 3 పడవలు, 3 జేసీబీలు, 2 టిప్పర్లు, 2 ట్రాక్టర్లతో పాటు నిల్వచేసిన 12 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చే సుకున్నారు. అనంతరం బేల తహసీల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్ రఘునాథ్‌రావు మాట్లాడు తూ సీజ్ చేసిన వాహనాలను ఎవరైనా తీసుకుపోతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. కాంగార్పూర్ నది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో మైనింగ్ ఏడీ రవీందర్, మై నింగ్ టీఏ రమేశ్, డిప్యూటీ తహసీల్దార్ వామన్‌రావు, ఆర్ఐ అశోక్, పోలీసులు పాల్గొన్నారు.