ఎదులాపురం, మే 5 : పశువుల అక్రమ రవాణాపై సమాచారం ఉన్నా పోలీస్ యంత్రాంగానికి తెలియజేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవా రం ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఖురేషి కులస్తులు, అలాగే డీఎస్పీ కార్యాలయంలో హిందూ సంఘాలు, గోరక్షక సమితి సభ్యులతో వేరువేరుగా సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.
మొదటగా ఖురే షి కులస్తులతో సరైన అనుమతులు పత్రాలు ఉన్న పశువులను మాత్రమే సంహరించాలని, ఆవులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంహరించవద్దని సూచించారు. హిందూ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న పోలీసు శాఖకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సీఐలు కే నాగరాజు, బీ సునీల్ కుమార్, కే ఫణిదర్, కే స్వామి పాల్గొన్నారు.