ఎదులాపురం, ఏప్రిల్ 4 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూగర్భజలాల రీచార్జ్ కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం కలెక్టరేట్లో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మా ట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ప్రాజెక్ట్‌లో పనులను వేగవంతం చేయాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం బేస్ మెంట్ ఏరియా 400 ఎస్ఎఫ్టీ కంటే ఎకువ గాని, తకువ గాని, ఉండకూడదని, సిమెంట్ ఇటుకలతోనే గోడలు నిర్మించుకోవాలని, లోకల్ ఇటుకలు వాడకూడదని అన్నారు. దీనిపై లబ్ధిదారులకు అవగాహన క ల్పించారు. నిరుపేద లబ్ధిదారులకు ఎస్‌హెచ్‌జీ గ్రూప్ ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు డీఆర్డీవో చర్య లు చేపట్టాలని తెలిపారు.
మండలాల వారీగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఎంపీడీవో ఆధ్వర్యంలో ఈ నెలాఖరు వరకు 20 నుంచి 30 బేస్మెంట్లు నిర్మించాలని, ఏఈలు ఫొటో అప్లోడ్ చేయాలన్నారు. బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇండ్ల వివరాలు హౌసింగ్ విభాగానికి పంపితే రూ.లక్ష చొప్పున లబ్ధిదారులకు చెల్లింపు లు జరుగుతాయని చెప్పారు. ఇంకా ప్రారంభం కానీ చోట త్వరగా ప్రారంభించాలని, మేస్త్రీలను ఒకో మం డలం నుంచి కొంత మందిని తీసుకొని వారికి శిక్షణ ఇవ్వాలన్నారు. మోడల్ విలేజ్ నిర్మాణ పనులు జూన్ 30లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసేందుకు రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్లో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు వివరించారు. మున్సిపాలిటీ, ఎంపీడీవో కార్యాలయంలో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ మనోహర్, సీఈవో, డీపీవో, బ్యాంక్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.